భారత్ న్యూస్ ఢిల్లీ…శుభాంశు శుక్లా ఎన్ని సార్లు భూమిని చుట్టి వచ్చారో తెలుసా?
యాక్సియం-4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా, మరో ముగ్గురు వ్యోమగాములు మరికొన్ని గంటల్లో భూమిపైకి రానున్నారు. గత నెల నింగిలోకి వెళ్లిన వీరు 28 గంటల ప్రయాణం తర్వాత ఐఎస్ఎస్కు చేరుకున్నారు. రెండు వారాలుగా అక్కడే ఉన్న శుభాంశు శుక్లా.. ఏకంగా 96.5 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. 230 సార్లు భూమిని చుట్టి వచ్చారని యాక్సియం స్పేస్ వెల్లడించింది.
