భారత్ లోకి మాదకద్రవ్యాలను చొప్పించేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలను అడ్ఢుకునేందుకు సరిహద్దు భద్రతా దళం జమ్మూలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది.

భారత్ న్యూస్ నెల్లూరు….భారత్ లోకి మాదకద్రవ్యాలను చొప్పించేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలను అడ్ఢుకునేందుకు సరిహద్దు భద్రతా దళం జమ్మూలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది.

దీనిలో భాగంగా… ఆర్.ఎస్. పురాలోని బిడిపూర్ గ్రామం సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో 5.3 కిలోల హెరాయిన్‌ను BSF దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

మాదకద్రవ్యాలను డ్రోన్ ద్వారా సరిహద్దు వద్ద వదిలివేసినట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి.

ఈ ఘటనపై దర్యాప్తుకు అధికారులు ఆదేశించారు.