హన్మకొండ డి ఈ ఓ వాసంతి పై వేటు*

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….హన్మకొండ డి ఈ ఓ వాసంతి పై వేటు*

హనుమకొండ డీఈవో డి. వాసంతిని ఆ పోస్టునుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

ఆమె స్థానంలో హనుమకొండ అడిషనల్ కలెక్టర్ ఎ.వెంకట్రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది.

డిప్యూటీ ఈవో అయిన వాసంతి ఎఫ్ఎసీ హోదాలతో డీఈవోగా పనిచేస్తున్నారు. ఆమెపై పెద్దఎత్తున ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వమే నేరుగా చర్యలు తీసుకుందని ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది

ఆమె డిప్యూటీ ఈవోగా ఉన్న సమయంలో సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సంబంధించి స్థలం విషయంలో చేసిన తప్పునకు గత ఏడాది రెండు ఇంక్రిమెంట్ల కోత విధిస్తూ విద్యాశాఖ చర్యలు తీసుకుంది

అలాగే ఆమెపై ఉపాధ్యాయులు, విద్యాశాఖలోని వివిధవర్గాల నుంచి ప్రభుత్వానికి పెద్దఎత్తున ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం నిఘావర్గాల నివేదిక ఆధారంగా డీఈవో పోస్టు నుంచి తొగించినట్టు ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు