తెలంగాణలో వర్షాలు.. అందుబాటులోకి టోల్ ఫ్రీ నంబర్‌

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…..తెలంగాణలో వర్షాలు.. అందుబాటులోకి టోల్ ఫ్రీ నంబర్‌

తెలంగాణలో కురుస్తోన్న భారీ వ‌ర్షాల నేపథ్యంలో పంచాయతీ రాజ్ శాఖ ఈఎన్‌సీ కార్యాలయంలో ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. టోల్‌ఫ్రీ నంబర్‌ 040-3517-4352ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారీ వర్షం, వరదల కారణంగా ఎక్కడైనా రహదారులు దెబ్బతిన్నా, కల్వర్టులు కూలినా, గండ్లు పడ్డా వెంటనే సంబంధిత నంబర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపింది. ప్రతి సర్కిల్ స్థాయిలోనూ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది….