భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…..భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్

కామారెడ్డి జిల్లా ::

తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కామారెడ్డి, మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో పలు ప్రాంతాలు జలమయమ య్యాయి, చాలా చోట్ల వరద నీరు రోడ్డుపైకి చేరింది,

ఈ నేపథ్యంలోనే గురువారం ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలకు మెదక్ జిల్లా డీఈవో రాధా కిషన్ సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సెలవు ప్రకటించినట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు DEO రాజు తెలిపారు.

కామారెడ్డి జిల్లాలో బుధవారం ఉదయం నుండి కుండపోత వర్షం కురిసింది, రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షంతో కామారెడ్డి, జలమయ మైంది,వరద నీరు ఉప్పొంగి ప్రవహించడంతో జనజీవ నం స్తంభించిపోయింది రోడ్లు చెరువులను కుంట లను తలపిస్తున్నాయి, దీంతో కామారెడ్డి నుంచి హైదరాబాదుకు రాకపోకలు నిలిచిపోయాయి,

దీంతోపాటు ఈ భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా భిక్కనూరు,తలమట్ల దగ్గర రైల్వే ట్రాక్ తీవ్రంగా దెబ్బతింది, వరద నీరు రైల్వే ట్రాక్ నుంచి ప్రవహించడంతో రైల్వే ట్రాక్ కింద ఉన్న కంకర కొట్టుకుపోయింది.. దీంతో రైల్వే రాకపోకులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది…

విశాఖపట్నం – నాందేడ్ ఎక్స్‌ప్రెస్ అక్కన్నపేట్ జంక్షన్ దగ్గర 3 గంటల నుండి అక్కడే ఉంది. కాచిగూడ – మెదక్ ప్యాసింజర్ మీర్జాపల్లి వద్ద 2 గంటల పాటు నిలిచి పోయింది, నాందేడ్ – మేడ్చల్ ప్యాసింజర్ కామారెడ్డి వద్ద రెండున్నర గంటల నుండి అక్కడే ఉంది. ముంబై – లింగంపల్లి దేవగిరి ఎక్స్‌ప్రెస్ నిజామాబాద్ వద్ద గంట గంటన్నర నుంచి అక్కడే ఉంది. భగత్ కి కోఠి – కాచిగూడ ఎక్స్‌ప్రెస్ నవీపేట్ వద్ద గంటన్నర నుండి అక్కడే నిలిచిపోయింది…