.భారత్ న్యూస్ హైదరాబాద్….సినీ నటుడు రాజీవ్ కనకాలకు పోలీసుల నోటీసులు జారీ అయ్యాయి. పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని పసుమాముల ప్రాంతంలో ఉన్న వివాదాస్పద ప్లాట్ అమ్మకానికి సంబంధించి ఈ వివాదం చుట్టూ తిరుగుతోంది.
ఈ ప్లాట్‌ను సినీ నిర్మాత విజయ్ చౌదరి వద్దకు రాజీవ్ కనకాల విక్రయించారు. అనంతరం అదే ప్లాట్‌ను విజయ్ చౌదరి మరో వ్యక్తికి రూ.70 లక్షలకు అమ్మినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.
లేని ప్లాట్‌ను ఉన్నట్లు చూపి మోసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హయత్‌నగర్ పోలీస్ స్టేషన్లో విజయ్ చౌదరిపై కేసు నమోదు కాగా, ప్లాట్ అమ్మకానికి సంబంధించి వివరాలు తెలుసుకోవాలని రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసుల నుంచి నోటీసులు జారీ అయ్యాయి.
