తన వర్గాన్ని విస్తరించే పనిలో కవిత!

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా …..తన వర్గాన్ని విస్తరించే పనిలో కవిత!

TG: BRSకు, MLC పదవికి రాజీనామా చేసిన కవిత తన ప్రధాన అనుచరులతో నిన్న రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. జాగృతి SM ప్రతినిధులతో సమావేశం అయ్యారని, కొందరు BRS కార్యకర్తలు కూడా ఆమెను కలిసినట్లు సమాచారం. ఉద్యమం సమయంలో యాక్టివ్గా ఉండి, BRSలో ప్రాధాన్యం దక్కని నేతలను జాగృతిలో చేరాలని ఆమె కోరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఇవాళ ఆమె మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసే అవకాశముంది.