భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…..ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన TGSRTC
తెలంగాణ :
📍గ్రేటర్ హైదరాబాద్ ప్రయాణికులకు TGSRTC శుభవార్త చెప్పింది.
ఒక రోజంతా సిటీ బస్సుల్లో ప్రయాణించే ట్రావెల్ యాజ్ యూ లైక్ టికెట్ ధరను తగ్గించినట్లు వెల్లడించింది.
పెద్దలకు రూ.150 టికెట్‌ను రూ.130కి, మహిళలు, సీనియర్ సిటిజన్స్ రూ.120 టికెట్‌ను రూ.110కి, పిల్లలకు రూ.100 టికెట్‌ను రూ.90కి అందజేస్తున్నట్లు చెప్పింది.
ఈ సదుపాయం ఈ నెల 15 నుంచి 31వ తేదీ వరకు ఉంటుందని పేర్కొంది.
