అతిగా స్నేహితులుని నమ్మాడు….ప్రాణాలు తీసుకున్నాడు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….అతిగా స్నేహితులుని నమ్మాడు….ప్రాణాలు తీసుకున్నాడు…..నమ్మిన స్నేహితులు తన పేరు మీద అప్పులు, లోన్లు తీసుకుని మోసం చేశారు..మోసం తట్టుకోలేక మత్తు ఇంజక్షన్లు తీసుకుని డాక్టర్ బలన్మరణం కి పాల్పడ్డాడు

తెలంగాణ
కరీంనగర్

స్నేహితులు తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వడం లేదని ఓ డాక్టర్ మానసిక ఆవేదనకు గురయ్యడు.

ఎన్నిసార్లు అడిగినా స్నేహితుల నుంచి సరైన స్పందన రాలేదు.

అప్పులు మరింత పెరిగిపోయాయి..

చివరకు అప్పులు తీర్చలేమన్న బాధతో.. ఇంజక్షన్లు చేసుకుని.. డాక్టర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

వివరాలు లోకి వెళితే….

కరీంనగర్ జిల్లా నగునూరులోని ప్రతిమ వైద్య కళాశాలలో అనస్థీషియా పీజీ రెండో సంవత్సరం చదువుతున్న ఎంపటి శ్రీనివాస్ (42) అనే వైద్యుడు నుంచి.. కరీంనగర్ ప్రాంతానికి చెందిన వింజనురి కరుణాకర్ రూ.1.50 కోట్లు, కిరణ్, కవిత, వెంకట నరహరి అనే ముగ్గురు స్నేహితులు రూ.1.35 కోట్ల బ్యాంకు రుణం, బంజేరుపల్లికి చెందిన కుమారస్వామి తన వ్యాపారం కోసం రూ.28 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఈ డబ్బులు తిరిగి చెల్లించడం లేదు. ఎన్నో సార్లు అడిగిన సరైన సమాధానం చెప్పడం లేదు.

అంతేకాకుండా.. శ్రీనివాస్ బ్యాంకు ఈఎంఐలు చెల్లించలేడం కష్టం గా మారింది. శ్రీనివాస్‌పై ఒత్తిడి తెచ్చిన బ్యాంకు అధికారులు.. అప్పు తీర్చాలంటూ అడిగారు. అప్పు తీసుకున్న వ్యక్తులు ఇవ్వమని అడిగితే, ఏం చేసుకుంటావో చేసుకోమని బెదిరించారు. స్నేహితుల తీరుతో తీవ్ర మనస్తాపం చెందిన శ్రీనివాస్.. బలవన్మరణానికి పాల్పడ్డాడు.. అనస్థీషియా ఇంజక్షన్ ను మొతాదుకు మించి వేసుకున్నాడు.

ఇంట్లో ఎవరు లేని సమయంలో అనస్థీషియా ఇంజక్షన్ వేసుకుని.. అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. ఆసుపత్రికి తరలించే లోపే చనిపోయాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు