భారత్ న్యూస్ తెలంగాణ జిల్లాకాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చేతకాకపోతే దిగిపోండి
ట్రాన్స్ జెండర్ పుష్పత లయ
పరిపాలన చేత కావడం లేదంటూ ట్రాన్స్ జెండర్ పుష్పిత లయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరంగల్ నగరం మొత్తం వరదల్లో మునిగిపోయిందని, ఇందుకు వారి నిర్లక్ష్యమే కారణమంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేల పరిపాలన వైఫల్యానికి నిరసనగా వారికి పసుపు కుంకుమ, గాజులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా బుధవారం వరంగల్లో పుష్పిత లయ మాట్లాడుతూ వరంగల్ నగర పరిధిలో గెలుపొందిన నలుగురు స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీకి పరిపాలన చేయడం రావడంలేదని అన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు మరియు హంటర్ రోడ్ బొంది వాగు ఏరియా జలమయమైందని పేర్కొంది. ప్రతి సంవత్సరం వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆరోపించింది. చెరువులు, కుంటలను కబ్జాలు చేస్తున్న ప్రజాప్రతినిధులు కబ్జాదారుల దగ్గర కమిషన్ తీసుకొని కబ్జాదారులకే సపోర్ట్ చేస్తున్నట్లు ఆరోపించింది. పాలన చేతకాకుంటే దిగిపోండంటూ.. ధ్వజమెత్తింది…
