బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులోనే తేల్చుకోండి : పిటీషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులోనే తేల్చుకోండి : పిటీషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు

స్తానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు అయిన పిటీషన్లను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు.

ఈ కేసు హైకోర్టులో విచారణ జరుగుతుందని.. అక్కడే తేల్చుకోవాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. అక్టోబర్ 8వ తేదీన హైకోర్టు బెంచ్ లో విచారణ ఉన్న క్రమంలోనే.. తమ వాదనలను అక్కడే వినిపించాలని సూచిస్తూ.. పిటీషన్లను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు.

బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలై పటిషన్ ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. సోమవారం (అక్టోబర్ 06) విచారణలో భాగంగా పిటిషన్ ను కొట్టివేసింది న్యాయస్థానం.

హైకోర్టులో విచారణ పెండింగ్ లో ఉండటంతో పిటిషన్ డిస్మిస్ చేసింది కోర్టు. కోటాపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం జీవో 9 జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. జీవో నెంబర్ 9 ని సవాలు చేస్తూ వంగ గోపాల్ రెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషన్ ను డిస్మిస్ చేసింది.