భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ఒకే జిల్లా పరిధిలోకి అసెంబ్లీ సెగ్మెంట్స్!
TG: జనాభా లెక్కల అనంతరం కేంద్రం డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టనున్న విషయం తెలిసిందే. దీంతో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగడంతో పాటు జిల్లాలకు తగ్గట్టు సరిహద్దులు మారనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 38 సెగ్మెంట్లు 2, 3 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత వీటితో పాటు కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలు సైతం ఒకే జిల్లా పరిధిలోకి రానున్నాయి. దీంతో రాజకీయ సమీకరణాలు కూడా మారుతాయి..
