కేటీఆర్‌పై కేసు నమోదు చేయాలి: మంత్రి పొన్నం

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…కేటీఆర్‌పై కేసు నమోదు చేయాలి: మంత్రి పొన్నం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. పది సంవత్సరాల పాలనలో అక్రమంగా సంపాదించిన అహంతో, ఓటర్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేయడం తగదని ఆయన విమర్శించారు. “ఓటుకి 5 వేల రూపాయలు అడుక్కోండి అని చెప్పడం అక్షేపణీయం” అని వ్యాఖ్యానించిన ఆయన, ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకుని కేటీఆర్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు…..