
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలో స్టార్ షెట్లర్ పీ.వీ. సింధూ ఓడిపోయింది. వాల్డ్ నెంబర్ 4 ర్యాంకర్ జపాన్ ప్లేయర్ యమగూచితో గంటా 6 నిమిషాలు పోరాటం చేసిన సింధూ, చివరకు ఓటమి చవిచూసింది. 12 -21, 21 -16, 16 – 21 పాయింట్లతో ఓడింది సింధూ. యమగూచితో ఓడిపోవడం ఇది పన్నెండో సారి. ఇక మిక్సుడ్ డబుల్స్ పోరుతో ధ్రువ్, తనీషా జంట 12 -21, 21 – 16, 21 – 18 పాయంట్లతో చైనీస్ తైపీకి చెందిన హంగ్ వీ, నికోల్ చాన్ మీద గెలిచారు. ఇదే విభాగంలో పోటీ పడిన మరో భారత జంట సూర్య, అమృత ఓడిపోయారు.