ఆసియా కప్ -2025 లో భారత జట్టును విజేతగా నిలపడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన యువ క్రికెటర్ తిలక్ వర్మను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు గారు అభినందించారు.

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఆసియా కప్ -2025 లో భారత జట్టును విజేతగా నిలపడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన యువ క్రికెటర్ తిలక్ వర్మను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు గారు అభినందించారు.

హైదరాబాద్ చేరుకున్న తిలక్ వర్మ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి గారిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిలక్ వర్మను, కోచ్ సలాం బయాష్‌ను ముఖ్యమంత్రి గారు సత్కరించారు. తిలక్ వర్మ తన క్రికెట్ బ్యాట్‌ను ముఖ్యమంత్రి గారికి బహూకరించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి గారు, తెలంగాణ క్రీడా ప్రాథికార సంస్థ చైర్మన్ శివసేనా రెడ్డి గారితో పాటు ఉన్నతాధికారులు ఉన్నారు.