భారత్ న్యూస్ విజయవాడ…ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ మీట్ ఈవెంట్….
📍రాష్ట్రంలోని 23 ఏకలవ్య పాఠశాలల విద్యార్థులతో స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం నిర్వహించడానికి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగుళ్లపల్లి ఏకలవ్య పాఠశాల వేదిక కానుంది…

రాష్ట్రస్థాయిలో జరిగే ఈ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపడుతున్నారు….
ఈ నెల 11 నుండి 13 వరకు జరగనున్న ఈ స్పోర్ట్స్ మీట్ సమావేశాన్ని ప్రారంభించడానికి మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్, ప్రిన్సిపల్ సెక్రటరీ సీతామహాలక్ష్మి, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రాలు ముఖ్య అతిథులుగా పాల్గొనున్నారు….