కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్ పవర్ లిఫ్టర్స్ ఫెడరేషన్ (NPF) మరియు కర్ణాటక స్టేట్ పవర్ లిఫ్టర్స్ అసోసియేషన్ (RAW) సంయుక్తంగా నిర్వహిస్తున్న

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….రోలుగుంట, అక్టోబర్ 8:
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్ పవర్ లిఫ్టర్స్ ఫెడరేషన్ (NPF) మరియు కర్ణాటక స్టేట్ పవర్ లిఫ్టర్స్ అసోసియేషన్ (RAW) సంయుక్తంగా నిర్వహిస్తున్న “నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్ (RAW) – 2025” పోటీలు ఈ నెల 9, 10, 11, 12 తేదీలలో బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని Essotto Recreation Hub వద్ద ఘనంగా జరగనున్నాయి.
ఈ జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో Sub-Junior, Teen Boys & Girls, Junior Boys & Girls, Senior Men & Women, Masters (1, 2 & 3) విభాగాలలో పోటీలు నిర్వహించబడనున్నాయి.
ఈ జాతీయ స్థాయి పోటీలకు మ్యాచ్ రిఫరీగా శ్రీమతి పి.వి.ఎం. నాగజ్యోతి గారు (ఇంగ్లీష్ టీచర్, ZPHS రోలుగుంట) నేషనల్ పవర్ లిఫ్టర్స్ ఫెడరేషన్ (NPF) తరఫున ఎంపిక కావడం విశేషం.
ఇప్పటికే శ్రీమతి నాగజ్యోతి గారు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్ కాంపిటీషన్లలో పాల్గొని అనేక పతకాలు సాధించారు. క్రీడల పట్ల ఆమె చూపిన నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదల యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
ఆమె సేవాభావం, క్రీడాస్ఫూర్తి, మరియు పవర్ లిఫ్టింగ్ రంగంలో చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ గౌరవం లభించడం ఆమెకు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణం.
ఈ సందర్భంగా పలువురు క్రీడాభిమానులు, సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు, మరియు స్థానిక ప్రజలు ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
శ్రీమతి నాగజ్యోతి గారి ఈ సాధన గ్రామానికి, మండలానికి, జిల్లాకు, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది.