విశాఖలో భారత్‌ – ఆసీస్‌ వన్డే.. టికెట్‌ ధర రూ.150

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖలో భారత్‌ – ఆసీస్‌ వన్డే.. టికెట్‌ ధర రూ.150

మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌ పోటీల నేపథ్యంలో విశాఖపట్నంలో సందడి నెలకొంది. అక్టోబర్ 9 నుంచి ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి.

9న భారత్‌-దక్షిణాఫ్రికా, 12న భారత్‌-ఆస్ట్రేలియా, 13న దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్‌, 16న ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్‌, 26న ఇంగ్లాండ్‌-న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి.

భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్‌ ధర రూ.150 కాగా, మిగతా అన్ని మ్యాచ్‌లకు రూ.100కే టికెట్లు అందుబాటులో ఉన్నాయి.