ఏలూరు జిల్లా : :క్రీడాకారిణులపై కోచ్ – కామ క్రీడలు

క్రీడాకారిణులపై కోచ్ – కామ క్రీడలు

భారత్ న్యూస్ గుంటూరు…Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏలూరు జిల్లా : ఏలూరు :

క్రీడాకారిణులపై కోచ్ – కామ క్రీడలు

జరిగిన ఘటన వాస్తవమేనని నిర్ధారించిన బెంగళూరు స్పోర్ట్స్ ఇన్వెస్టిగేషన్ టీమ్.

ఏలూరు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) హాస్టల్ ఇన్చార్జి & అథ్లెటిక్స్ కోచ్ వినాయక్ ప్రసాద్..

విజయవాడలో స్పోర్ట్స్ అకాడమీ హాస్టల్ నుండి మొదలు 20 సంవత్సరాల పైచిలుకు నుండి వినాయక్ ప్రసాద్ (కోచ్) లైంగిక వేధింపుల బారిన పడిన (వందల సంఖ్యలో) ఎంతోమంది క్రీడాకారిణిలు.

ఇప్పుడు వెలుగులోకి తెచ్చిన 10 మంది క్రీడాకారిణిలు.

వివరాల్లోకివెళితే..

ఏలూరులో ఉన్న స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాలో శిక్షణ పొందుతున్న బాలికలు లైంగిక వైదింపులకు గురవుతున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందటంతో బెంగుళూరు నుంచి వచ్చిన అధికారుల బృందం విచారణలో చేపట్టింది.

శనివారం వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, తదితర విభాగాల్లో శిక్షణ పొందుతూ అక్కడ వసతి పొందుతున్న బాలికలను అధికారులు విచారించి పూర్తి వివరాలు వారివద్ద నుండి రాబట్టారు.

లైంగిక వేదింపులు వాస్తవమేనని తెలుసుకుని ఏలూరు టూటౌన్ పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు.