భారత్ న్యూస్ మంగళగిరి ….కెనడాలో జరుగుతున్న ప్రపంచ యూత్ చాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించి వరల్డ్ చాంపియన్గా నిలిచిన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన చికిత తానిపర్తికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలియజేశారు. అండర్ 21 కేటగిరీ ఫైనల్ లో కొరియాకు చెందిన పార్క్ యెరిన్పై విజయం సాధించి స్వర్ణం చేజిక్కించుకుని చికిత వరల్డ్ చాంపియన్గా నిలవడం దేశానికే గర్వకారణమని అన్నారు.
📍ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, లక్ష్యాన్ని సాధించాలన్న చికిత సంకల్పం యువతీ యువకులకు స్ఫూర్తిదాయమని అన్నారు. ఆటుపోట్లను తట్టుకుంటూ గ్రామీణ ప్రాంతం నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆర్చరీలో రాణించిన చికిత భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారు. చిన్ననాటి నుంచి చికితలోని ప్రతిభను గుర్తించి అందుకు అనుగుణంగా ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలియజేశారు.
