భారత్ న్యూస్ హైదరాబాద్….ఆసియా కప్ సమరానికి సర్వం సిద్ధం!
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆసియా కప్ 2025 టోర్నీకి రంగం సిద్దమైంది. మరో నాలుగు రోజుల్లో ఈ టోర్నీకి తెరలేవనుంది. సెప్టెంబర్ 9న యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఒక్కొక్కరుగా దుబాయ్ కి చేరుకున్న భారత ఆటగాళ్లు శుక్రవారం సాయంత్రం నుంచి తొలి ప్రాక్టీస్ సేషన్ ప్రారంభించింది…

ఆతిథ్య యూఏఈతో పాటు భారత్, పాకిస్థాన్, ఒమన్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంగ్ కాంగ్, అఫ్గానిస్థాన్ జట్లు ఈ టోర్నీలో తలపడుతున్నా యి. ఈ 8 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. యూఏఈ, పాకిస్థాన్, ఒమన్‌తో కలిసి భారత్ గ్రూప్-ఏలో ఉంది. లీగ్ దశలో ప్రతీ జట్టు ఒక్కో మ్యాచ్ ఆడనుంది. టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-4కు అర్హత సాధిస్తాయి. నాలుగు జట్లు మరోసారి ఒక్కోసారి తలపడుతాయి.
టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్ చేరుతాయి. ఇప్పటి కే తమ జట్లను ప్రకటించిన ఆయా దేశాలు సన్నాహకా లు కూడా ప్రారంభించాయి. యూఏఈ, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ జట్లు సన్నాహకంగా ట్రై సిరీస్ ఆడుతున్నాయి. ఇంగ్లండ్ పర్యటన అనంతరం విశ్రాంతిలో ఉన్న భారత జట్టు మాత్రం ఇంకా సన్నా హకాలు మొదలుపెట్టలేదు. చేరుకున్న టీమిండియా ఇప్పటికే టీమ్ఇండియా ప్లేయర్లు దుబాయ్‌లో అడుగుపెట్టేశారు.
ఈసారి పొట్టి ఫార్మాట్ మ్యాచులు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరో రెండు రోజుల్లో టీమిండియా యూఏఈకి చేరనుంది. తొలి మ్యాచ్‌ను యూఏఈతో సెప్టెంబర్ 10న ఆడనున్న భారత్.. సెప్టెంబర్ 14న దాయాదీ పాకిస్థాన్‌తో తలపడనుంది. సెప్టెంబర్ 19న ఒమన్‌తో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. పాకిస్థాన్, భారత్ మెరుగైన ప్రదర్శన చేసి ఫైనల్ చేరితే మూడు సార్లు తలపడుతాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, పాక్ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.