పాక్‌ వైమానిక దాడి.. ముగ్గురు అఫ్గాన్‌ క్రికెటర్లు మృతి

భారత్ న్యూస్ విశాఖపట్నం..పాక్‌ వైమానిక దాడి.. ముగ్గురు అఫ్గాన్‌ క్రికెటర్లు మృతి

పాక్‌-అఫ్గాన్‌ సరిహద్దుల్లోని పాక్టికా ప్రావిన్స్‌లో పాకిస్థాన్‌ చేసిన వైమానిక దాడుల్లో ముగ్గురు అఫ్గాన్‌ దేశవాళీ క్రికెటర్లు మృతి చెందారు. వీరంతా వచ్చే నెలలో పాక్‌, శ్రీలంకతో జరిగే ట్రై నేషన్‌ సిరీస్‌ కోసం అఫ్గాన్‌లోని ఉర్గాన్‌ నుంచి శరనకు వెళ్లారు. ఈ దాడిలో మొత్తం ముగ్గురు క్రికెటర్లు సహా 8 మంది మృతి చెందారు. మృతి చెందిన క్రికెటర్లను కబీర్‌, సిబాతుల్లా, హరూన్‌గా గుర్తించారు. ఈ దాడి కారణంగా అఫ్గానిస్థాన్‌ ట్రై సిరీస్‌ నుంచి నిష్క్రమించింది.