భారత్ న్యూస్ డిజిటల్: తెలంగాణ:
మినరల్ వాటర్ ప్లాంట్ కోసం యువ సర్పంచ్, వైద్య విద్యార్థిని నిఖిత కు 3లక్షలు అందజేసి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రోత్సాహం
ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతున్న K.N. నిఖిత ఇటీవల వై. షాగాపూర్ గ్రామ సర్పంచ్ గా ఎన్నిక
ఇవాళ మహబూబ్ నగర్,వనపర్తి జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి కోమటి రెడ్డిని వనపర్తి నియోజకవర్గంలో కలిసిన నిఖిత
వై.షాగాపూర్ గ్రామ సర్పంచ్ నిఖితను సన్మానించి,అభినందించిన మంత్రి
గ్రామ అభివృద్ధి కోసం మంత్రి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 3లక్షలు అందజేయడం పట్ల ధన్యవాదాలు తెలిపిన సర్పంచ్ నిఖిత
మంత్రి కోమటి రెడ్డి గారు యువతను రాజకీయాల్లో ప్రోత్సహించే తీరు ఎంతో సంతోషంగా ఉందన్న నిఖిత
భవిష్యత్ లో గ్రామ అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారని తన ఆనందాన్ని వ్యక్తం చేసిన సర్పంచ్ నిఖిత
మహబూబ్ నగర్,వనపర్తి:
పెబ్బేరు మండలం వై. షాగాపూర్ గ్రామ నూతన సర్పంచ్, ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతున్న నిఖిత మహబూబ్ నగర్, వనపర్తి జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని బుధవారం కలిశారు.
ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతూ…ప్రజా సేవ చేయాలని సర్పంచ్ గా ఎన్నికైన నిఖితను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. శాలువాతో సత్కరించారు. గ్రామంలో త్రాగునీటి ఇబ్బంది ఉందని మంత్రి దృష్టికి తీసుకురాగానే గ్రామ మినరల్ వాటర్ ప్లాంట్ కోసం యువ సర్పంచ్ నిఖిత కు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా తక్షణమే 3లక్షల రూపాయలు అందజేశారు.
గ్రామ అభివృద్ధి కోసం ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 3లక్షలు అందజేయడం పట్ల సర్పంచ్ నిఖిత మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. యువత రాజకీయాల్లో రాణించేందుకు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి లాంటి నాయకుల ప్రోత్సాహం ఎంతో అవసరమని,ఆయన స్పందించిన తీరుకు సర్పంచ్ నిఖిత సంతోషం వ్యక్తం చేసింది.

మంత్రితో పాటు పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి,స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డి,దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పలువురు నాయకులు,అధికారులు ఉన్నారు.