భారత్ న్యూస్ విజయవాడ…T20WC: నేపాల్‌పై ఇటలీ ఘన విజయం
టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఇటలీ నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. 124 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక్క వికెట్‌ను కోల్పోకుండా గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 123 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఇటలీ కేవలం 12.4 ఓవర్లలోనే టార్గెట్‌ను ఫినిష్ చేసింది. ఓపెనర్లు జస్టిన్ మోస్కా (60), ఆంథోనీ మోస్కా (62) హాఫ్ సెంచరీలు చేశారు.
