భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా …..తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు కృష్ణాజిల్లా చల్లపల్లి మండలానికి రానున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి 10:30కు హెలికాప్టరులో 12 గంటలకు మచిలీపట్నం వచ్చి రోడ్డు మార్గంలో రామానగరం వస్తారు. ఇక్కడ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్ యార్లగడ్డ సోమశేఖర ప్రసాద్ (లంకబాబు), వారి బంధువులతో కలిసి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 2గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు. ఈ మేరకు చల్లపల్లి పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు.
