భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…ఢిల్లీ పర్యటనలో తెలంగాణ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఢిల్లీలో కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవితో భేటీ అయ్యారు. ‘నిర్భయ నిధి’ కింద ములుగు జిల్లాను “మహిళలు, బాలికల కోసం సమ్మిళిత నగరాలు” ప్రాజెక్టుకు ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టును వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ‘పాలనా’ పథకం కింద పనిచేస్తున్న క్రెచ్ వర్కర్లు, హెల్పర్ల గౌరవ వేతనాలను ప్రస్తుత జీవన ప్రమాణాలకు అనుగుణంగా పెంచాలని కేంద్ర మంత్రిని కోరారు. మహిళా సాధికారత, భద్రత విషయంలో కేంద్రం సహకరించాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు.