బాలికపై హత్యాచారం కేసులో నిందితుడికి 12 ఏళ్ల తర్వాత రెండు ఉరిశిక్షలు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…..బాలికపై హత్యాచారం కేసులో నిందితుడికి 12 ఏళ్ల తర్వాత రెండు ఉరిశిక్షలు

నిందితుడికి రెండు ఉరిశిక్షలు, రూ.1.10 లక్షలు జరిమానా.. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశం

నిందితుడికి జైలు శిక్ష విధించిన పొక్సో కోర్టు ఇన్‌ఛార్జి జడ్జి రోజా రమణి

2013లో నల్గొండకి చెందిన 12 ఏళ్ల బాలికపై హత్యాచారం చేసిన నిందితుడు

నిందితుడు నల్గొండకు చెందిన మోహమ్మీ ముకర్రం

ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి.. మృతదేహాన్ని మురికి కాల్వలో పడేసిన నిందితుడు

బాలిక కనిపించడం లేదని నల్గొండ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబసభ్యులు

నిందితుడిపై పొక్సో, హత్య నేరం కేసు నమోదు చేసిన పోలీసులు

పదేళ్లుగా నల్గొండ జిల్లా కోర్టులో నడుస్తున్న వాదనలు

అయితే హత్య చేసినందుకు దోషి మహ్మద్ ముకర్రంకు ఐపీసీ ప్రకారం ఉరిశిక్ష రూ.50 వేల జరిమానా, అలాగే అత్యాచారం చేసినందుకు పోక్సో చట్టం ప్రకారం ఉరిశిక్ష, రూ.50 వేల జరిమానా, మరియు ఆధారాలు నాశనం చేసినందుకు ఐపీసీ చట్టం ప్రకారం ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించిన కోర్టు

తీర్పు పై హర్షం వ్యక్తం చేసిన బాలిక కుటుంబ సభ్యులు