భారత్ న్యూస్ హైదరాబాద్….ట్రైన్ ఆలస్యంతో పరీక్ష రాయలేకపోయిన విద్యార్థిని.. రూ.9 లక్షల పరిహారం
📌ఉత్తరప్రదేశ్ బస్తీ (Basti) జిల్లాకు చెందిన సమృద్ధి (Samruddhi) అనే విద్యార్థిని 2018లో బీఎస్సీ బయోటెక్నాలజీ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంది. పరీక్షకు లక్నోలోని జై నారాయణ్ పీజీ కళాశాల సెంటర్ పడింది.

📌 దీంతో పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి ఆమె ‘ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్’ రైలు ఎక్కింది. కానీ, ఆ రైలు నిర్ణీత సమయం కంటే రెండున్నర గంటలు ఆలస్యంగా చేరుకుంది. దీంతో సమృద్ధి టైమ్‌కి పరీక్షా కేంద్రానికి చేరుకోలేకపోయింది. ఫలితంగా ఆమె ఓ అకాడమిక్ ఇయర్‌ను కోల్పోవాల్సి వచ్చింది.
📌 దీంతో తీవ్ర మనోవేదనకు గురైన విద్యార్థిని రైల్వే శాఖపై న్యాయపోరాటానికి దిగింది. జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది.