భారత్ న్యూస్ రాజమండ్రి…ఆంధ్రప్రదేశ్ పరువు నిలబెట్టిన బామ్మ గారు
21 వ జాతీయ మాస్టర్స్ ఈత పోటీల్లో.. 82 ఏళ్ళ బామ్మ 3 పతకాలు సాధించి మన రాష్ట్ర పరువు నిలబెట్టారు.
దాదాపు 300 ఈవెంట్స్ లో కనీసం ఒక్క పతకమైనా ఆంధ్రప్రదేశ్ కు దక్కలేదే అనే బాధ నన్ను వేధించింది.
అయితే 80+ మహిళల విభాగంలో అమలాపురపు సుబ్బలక్మమ్మ గారు
రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించి మనకు గర్వ కారణంగా నిలిచారు.
అంత పెద్ద age గ్రూప్ లో పోటీదారులు తక్కువ గా ఉంటారు అని తీసిపారేయడానికి లేదు. ఆమె పోరాట తత్వం ప్రతి వారికి స్పూర్తి దాయకం.
మచిలీపట్నానికి చెందిన సుబ్బలక్ష్మమ్మ గారు రిటైర్డ్ botony ప్రొఫెసర్. విజయవాడ లో విశ్రాంతి జీవితం గడుపుతున్నారు.
ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక తన మనవడికి ఈత నేర్పించేందుకు విజయవాడ మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ కు వెళ్లేవారు.
అలా ఈత పై మక్కువ పెంచుకుని తాను కూడా ఈత నేర్చుకున్నారు. అనంతరం దేశం లో ఎక్కడ ఈత పోటీలు జరిగినా పాల్గొంటూ వచ్చారు.
70+ విభాగంలో ఆవిడ ఇప్పటికే ఎన్నో పతకాలు గెలుచుకొచ్చారు.
80 ఏళ్లు దాటాక కూడా ఆమెలో పట్టుదల పోలేదు.
నిన్న 50 మీ. ఫ్రీ స్టైల్ విభాగంలో
పంజాబ్ బామ్మ సులేఖా కౌర్ తో పోటీ పడి రజతం సాధించారు. ఈ రోజు 50 మీ back stroke లో
అదే మహిళను రెండో స్థానానికి నెట్టేసి Gold గెలుచుకున్నారు. 200 మీ ఫ్రీ స్టైల్ లో ఒంటరిగా ఈది మరో గోల్డ్ కొట్టేశారు.
Age is just a number అని ఇలాంటి వారిని చూసే కదా అంటారు..
