సంక్రాంతి సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ సౌకర్యవంతమైన సేవలు.

భారత్ న్యూస్ డిజిటల్:హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ

సంక్రాంతి సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ సౌకర్యవంతమైన సేవలు

గత నాలుగు రోజులుగా పండుగ రద్దీకనుగుణంగా ప్రత్యేక బస్సులతో ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేత

రవాణా సేవల్ని నిరంతరం పర్యవేక్షిస్తున్న అధికారులు, సూపర్వైజర్స్

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులతో సేవల్ని అందిస్తోంది. పట్టణాల నుంచి పల్లెలలకు వెళ్లే ప్రయాణికులకు ఏమాత్రం అసౌకర్యం కలుగకుండా ముందస్తు తగిన ఏర్పాట్లతో వారి వారి గమ్యస్థానాలకు చేరవేస్తోంది. ఈ నెల 9 నుంచి ప్రత్యేక బస్సులతో ఆయా ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యాన్ని అందిస్తున్న టీజీఎస్ఆర్టీసీ 13.01.2026 వరకు 5375 స్పెషల్ బస్సులను ఆపరేట్ చేసింది.

ప్రయాణికులకు ఎలాంటి అవంతరాలు ఎదురు కాకుండా ఉండేందుకు ముందస్తుగా తీసుకున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి బస్సుల రాకపోకలకు సంబంధించిన సమాచారాన్ని అందజేస్తున్నారు. సంస్థ అధికారులు కూడా ఆయా పాయింట్లను స్వయంగా పర్యవేక్షిస్తూ రవాణా ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సిబ్బందికి తగు ఆదేశాలు ఇస్తున్నారు. హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది

కాగా, ఈ నెల 9 వ తేదిన 721, 10 వ తారీఖున 1645, 11న 1180, 12న 1109, 13న (6 గం.ల వరకు) 720 ప్రత్యేక బస్సులలో ప్రయాణికులను సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు చేరవేసినట్లు సంస్థ వెల్లడించింది. ప్రధానంగా జె.బి.ఎస్ (1484), ఎంజీబీఎస్ (1170), ఉప్పల్(807), కె.పి.హెచ్.బి (916), ఎల్.బి.నగర్ (715), ఆరాంఘర్ (283) నుంచి స్పెషల్ బస్సలను నడుపడం జరిగింది.

అలాగే, సంక్రాంతి పండుగ అనంతరం తిరుగు ప్రయాణంలో కూడా ప్రయాణికులకు ఎలాంటి అవరోధాలు తలెత్తకుండా ఉండేందుకు ఈ నెల 18, 19 న ప్రత్యేక బస్సుల్ని నడుపనున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేకమైన రవాణా సేవల కోసం సిబ్బంది అంకితభావంతో విధుల్ని నిర్వహిస్తున్నారని పేర్కొంది.

ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోకుండా తగిన సమాచారాన్ని అందించడం జరుగుతోందని, సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ముందస్తుగా రిజర్వేషన్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకుని టీజీఎస్ ఆర్టీసీ సేవల్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

సంక్రాంతి ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000,040-23450033లలో సంప్రదించాలని సూచించింది.