రేపు తెలంగాణ కేబినెట్ భేటీ

.భారత్ న్యూస్ హైదరాబాద్….రేపు తెలంగాణ కేబినెట్ భేటీ

తెలంగాణ కేబినెట్ సోమవారం భేటీ కానుంది. మధ్యాహ్నం రెండు గంటలకు జరగనున్న ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే రైతు భరోసా చెల్లింపు, సన్న వడ్లకు బోనస్, ఇందిరమ్మ ఇళ్లు సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. కాగా.. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాల్రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే.