ట్యాంక్ బండ్ శివకు ప్రభుత్వం తరపున సాయం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు

భారత్ న్యూస్ హైదరాబాద్….ట్యాంక్ బండ్ శివకు ప్రభుత్వం తరపున సాయం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు

కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థికసాయంతో పాటు అతని కుమారుడు వేణుమాధవ్ కు హోం గార్డు ఉద్యోగ నియామకపత్రం అందజేసిన సీఎం.

ట్యాంక్ బండ్ పై ఎంతో మంది ప్రాణాలను కాపాడిన శివ…

ఇటీవల ముఖ్యమంత్రి దృష్టికి చేరిన ట్యాంక్ బండ్ శివ దీన పరిస్థితి.

ఉపాధి లేక కుటుంబ పోషణ భారమై ఇబ్బందులు పడుతున్న ట్యాంక్ బండ్ శివ.

ట్యాంక్ బండ్ శివకు అవసరమైన సాయం అందించాలని కొద్ది రోజుల క్రితం అధికారులను ఆదేశించిన సీఎం

ఉపాధి కోసం ట్యాంక్ బండ్ సమీపంలో ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించి ఇవ్వాలని కోరిన ట్యాంక్ బండ్ శివ

ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం.

శివ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం

సీఎం చేతులమీదుగా సాయం అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ట్యాంక్ బండ్ శివ, కుటుంబసభ్యులు.