.కొండా సురేఖ రాజీనామా కోరిన అధిష్టానం..!

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….కొండా సురేఖ రాజీనామా కోరిన అధిష్టానం..!

పట్టించుకొని సురేఖా..!

నాలుగు రోజులైన స్పందించకపోవడంతో మంత్రి పదవి నుండి తప్పించాలని అధిష్టానం ఆదేశం..!

నేడు మంత్రివర్గ సమావేశంలో.చర్చించిన తర్వాత తొలగింపు ను ప్రకటించే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది..!

మేడారంలో టెండర్ల విషయంలో పొంగులేటి కొండా మధ్య తలెత్తిన వివాదం అనేక మలుపులు తీసుకుంది… నిజానికి సురేఖ విషయంలో ఎప్పటినుండో అసంతృప్తిగా ఉన్న పెద్దలు.. అదును చూసి టాస్క్ మొదలు పెట్టారని అంటున్నారు

జిల్లా నేతలతో వివాదాలు.. గొడవలు.. నాగచైతన్య సమంత పై వ్యాఖ్యల వివాదం.. మిగతా మంత్రులతో తరచూ విబేధాలు వివాదాలు… ఇలా ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నిత్యం ఏదో ఒక వివాదం పొడచూపుతున్న పరిస్థితుల్లో ఆమెను వదిలించుకోవడమే మేలనే అభిప్రాయానికి వచ్చారు..

సుమంత్ ను మించిన దాదాగిరి వసూళ్లకు పాల్పడే ప్రైవేట్ సహాయకులు ఎంతోమంది ఉన్నారు..

అయితే ఇపుడు సుమంత్ ను అరెస్ట్ చేస్తేనే కొండా సురేఖ కాస్త ఆత్మరక్షణలో పాల్పడి అధిష్టానం మాట వింటారని భావించినట్లుగా ఉంది..

ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే ఖాయంగా ఈరోజు మంత్రి పదవి నుండి కొండాను తొలగించడం లాంఛనమనే ప్రచారం పొలిటికల్ సర్కిల్ లో జోరుగా సాగుతోంది..!