భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,,వరంగల్.
మంత్రి సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్లు..
పిసిసి సభ్యుడు నల్గొండ రమేష్ ఇంట్లో మీడియా సమావేశం
పట్టిన జెండా విడవకుండా నలభై ఏండ్లుగా పార్టీకోసం పనిచేస్తున్నాం.
చిల్లర గాళ్లంటూ సీనియర్ల మనోభావాలను దెబ్బతీసిన మాటలను ఖండిస్తున్నాం.
వైఎస్ఆర్సిపి, టిఆర్ఎస్, కాంగ్రెస్ అంటూ పార్టీలు మారింది ఎవరో ఆత్మ పరిశీలన చేసుకోవాలి.👉🏻శాసనసభ ఎన్నికల్లో తేనేటి విందులు పెట్టి ఏకమై మెజార్టీతో గెలిపించింది మర్చిపోయారు.
ఈరోజు ఆ తేనేటి విందులే మింగుడు పడని విషంగా మారాయా.పార్టీ పరువును రోడ్డు కీడుస్తూ చిల్లర పనులు చేసింది ఎవరో ప్రజలు గమనిస్తున్నారు.
ఎన్నికల్లో వ్యతిరేకంగా ప్రచారం చేసిన కార్పొరేటర్ లనే అక్కును చేసుకున్నారు.
ఎంపీ ఎన్నికల్లో మంత్రి హోదాలో ఏ పార్టీ మెజార్టీ ఇచ్చారో ప్రజలకు అధిష్టానానికి తెలుసు.
ఏ పార్టీకి పోయి వచ్చినా కాంగ్రెస్ పార్టీ నుండి గెలిపించిన ఘనత సీనియర్లదే గుర్తుంచు కోవాలి..
కార్పొరేటర్లు ఎమ్మెల్యేను కలవాలంటే ఓ అనామకుని అనుమతి కంటే చిల్లర వేశమా.
ఓ మాజీ రౌడీషీటర్ చేతిలో వరంగల్ తూర్పు భవిష్యత్తును పెట్టారు..
స్వపక్షం ప్రతిపక్షం తేడా లేకుండా అక్రమ కేసులు పెట్టిన ఘనత మీది.
పార్టీలో కార్యకర్త హోదా లేని వ్యక్తి దగ్గరికి కార్పొరేటర్లు నాయకులు వెళ్లాలా.

సీనియర్లను చిల్లరగాళ్లు అన్న మాటలను వెనక్కు తీసుకోవాల్సిన అవసరం ఉంది..