..భారత్ న్యూస్ హైదరాబాద్….ఓయూలో విద్యార్థుల ఆందోళన
ఉస్మానియా యూనివర్సిటీలో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని సైన్స్ విద్యార్థులు భారీ ధర్నా చేపట్టారు. సిలబస్ పూర్తి కాలేదని, పరీక్షలను 10 రోజులు వాయిదా వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిన్న ధర్నా చేసిన విద్యార్థుల అరెస్టును ఖండిస్తూ, అడ్మిన్ బిల్డింగ్ ముందు ఆందోళన కొనసాగిస్తున్నారు. వీసీ నిరాకరించినా, పరీక్షలు వాయిదా పడేవరకు పోరాటం ఆపమని విద్యార్థులు హెచ్చరించారు.
