ఈఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులు

..భారత్ న్యూస్ హైదరాబాద్….సిఎం ఇంట్లో చిట్ చాట్
(కొన్ని ముఖ్యాంశాలు)

ఈఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులు

బిజెపి 12 ఏండ్లు, బిఆర్ఎస్ 10 ఏండ్లు,కాంగ్రెస్ రెండేళ్ల పాలన, ఫలితం రెఫరెండం కాదు

నాకు టెంపర్ మెంట్ ఎక్కువ, చాలాసార్లు దాన్ని కంట్రోల్ చేసుకునేందుకే ప్రయత్నం చేస్తూ ఉంటాను

సిఎంగా నాభాష (మాటలు) తప్పు పడుతున్న వారు మాజీ సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని “రండ” అన్నప్పుడు ఎందుకు స్పందించలేదు ? ఆమాట అనవచ్చునా..?

జర్నలిస్టులు ఉద్యోగులుగా ఏ సంస్థలో పనిచేస్తున్న నా స్నేహంలో తేడా ఉండదు

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు (వరంగల్, హైదరాబాద్) మోసం చేసిందే కేసిఆర్ కదా… నాడు వరంగల్ లో ఏమి చెప్పిండు ?

మీడియా రాజకీయ పార్టీల తరపున కాకుండా ప్రజల పక్షాన ఉండాలి

ఒక పెద్ద పేపర్ నా మాటలను తప్పుగా ప్రచురించింది. ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి కదా..!

ప్రధాన మీడియా సంస్థలు (పేపర్లు, టీవీలు) వారి వ్యాపార ప్రయోజనాలకు మీడియాను తాకట్టు పెట్టొద్దు

కేరళ తరహా జర్నలిస్టుల పింఛను పథకం అమలు చేయడంపై నిరాసక్తత, జర్నలిస్టులకు కొత్త కార్డులు జారీ ప్రక్రియలో జాప్యంపై కొన్నిసార్లు కోప్పడ్డాను.