భారత్ న్యూస్ ఢిల్లీ…..వీధి కుక్కలపై.. సుప్రీం సంచలన వ్యాఖ్యలు
దేశంలో వీధి కుక్కల ఉన్మాదం..భారత ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీసింది: సుప్రీం కోర్టు
వీధి కుక్కలు మానవులపై జరిగే క్రూరత్వం గురించి ఏమంటారు?: పిటీషనర్లను ప్రశ్నించిన సుప్రీంకోర్టు.
కుక్కల దాడులు పెరగడం కూడా ఆందోళన కలిగిస్తోంది: సుప్రీంకోర్టు
ఇలాంటి సంఘటనలు నిరంతరం జరుగుతున్నాయి. మన దేశాన్ని విదేశీయులు తక్కువ చేసి మాట్లాడటానికి కుక్కల బెడద కూడా కారణం: జస్టిస్ విక్రమ్ నాథ్.
వీధి కుక్కల సమస్యపై సుప్రీం నియమాలను అమలు చేసే చర్యలపై అఫిడవిట్‌లు సమర్పించని రాష్ట్రాల సిఎస్ లకు సమ్మన్లు జారీ చేసిన సుప్రీంకోర్టు
పశ్చిమ బెంగాల్, తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలను సమన్లు జారీ చేసిన సుప్రీంకోర్టు.
గత ఆగస్టు 22న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ ఆదేశాల అమలు వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించిన సుప్రీంకోర్టు.
తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా.

అఫిడవిట్ లను ఎందుకు సమర్పించలేదో వివరణ ఇవ్వాలని కూడా సిఎస్ లను ఆదేశించిన సుప్రీం ధర్మాసనం.