.భారత్ న్యూస్ హైదరాబాద్…మూసీ మురిసేలా మహాత్మా గాంధీ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్న సిఎం రేవంత్..
హైదరాబాద్:
లంగర్‌హౌస్ మూసీ నదికి పర్యాటక సొబగులు అద్దుకోనున్నాయి.నది సుందరీకరణలో భాగంగా బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.మూసీ, ఈసా, గోదావరి నదులతో త్రివేణి సంగమంగా అభివృద్ధి చేయనున్న బాపూఘాట్లోనే 150 అడుగుల ఎత్తయిన మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిసిందే.ఉగాది నుంచి గాంధీ సరోవర్ అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నారు.దీంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మహనీయుడు విగ్రహం ఇదే కానుంది. ప్రస్తుతం మన దేశంలో అత్యంత ఎత్తయిన గాంధీ కాంస్య విగ్రహం పట్నాలోని గాంధీ మైదానంలో ఉంది. దీని ఎత్తు 72 అడుగులు (22 మీటర్లు).
