భారత్ న్యూస్ విజయవాడ…రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో ఉత్తమ ప్రతిభ..!
బ్యాంక్ ఆఫ్ ఇండియా ,కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బ్యాంకర్స్ వారికి రాష్ట్రస్థాయి బ్యాట్మెంటన్ పోటీలు శనివారం విజయవాడ లోని సాయి సందీప్ బ్యాడ్మింటన్ అకాడమీ నందు జరిగాయి.
ఈ బ్యాట్మెంటన్ పోటీలలో కోడూరు డిసిసిబి బ్యాంక్ చీఫ్ మేనేజర్ ఎం వెంకటేశ్వర్లు, నందిగామ బ్యాంక్ నుంచి శ్రీరామ్ ఛాంపియన్ లగా నిలచి ఉన్నతాధికారుల చేతుల మీదుగా ప్రశంసా పత్రం, మెమెంటోస్ అందుకున్నట్లు మచిలీపట్నం కే డి సి సి బ్యాంక్ సీఈవో శ్యామ్ మనోహర్ తెలిపారు.

ఈ సందర్భంగా విజేతలను సీఈవో అభినందించారు.