భారత్ న్యూస్ తిరుపతి…చంద్ర గ్రహణం కారణంగా మార్చి 1, 2వ తేదీల్లో SSD టోకెన్ల జారీ రద్దు
ఇదివరకే టీటీడీ ప్రకటించిన విధంగా మార్చి 3వ తేదిన చంద్ర గ్రహణం కారణంగా మార్చి 2, 3వ తేదీలలో శ్రీవారి దర్శనాలకు సంబంధించి తిరుపతిలో జారీ చేసే స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయబడవు.
మార్చ్ 2, 3వ తేదీలకు సంబంధించిన SSD టోకెన్లు ముందురోజు అనగా మార్చి 1, 2వ తేదీల్లో జారీ చేయబడవు.
మరలా మార్చి 4వ తేది దర్శనానికి సంబంధించిన SSD టోకెన్లను మార్చి 3వ తేదిన జారీ చేయడం జరుగుతుంది.
అదేవిధంగా మార్చి 3వ తేది వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేయడమైనది. ఈ కారణంగా మార్చి 2వ తేదిన వీఐపీ దర్శన సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.