షాదీ డాట్ కామ్”తో సైబర్ నేరాలకు మార్గం సులువుగా మారింది

భారత్ న్యూస్ హైదరాబాద్….షాదీ డాట్ కామ్”తో సైబర్ నేరాలకు మార్గం సులువుగా మారింది

షాదీ డాట్ కామ్ కేసు విచారణలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

షాదీ డాట్ కామ్ వెబ్‌సైట్‌లో యానాం ఎమ్మెల్యే ఫోటోతో ప్రొఫైల్ సృష్టించి, పెళ్లి కాని యువతులను మోసం చేసిన రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన చెరుకూరి హర్ష అలియాస్ జోగడ వంశీకృష్ణ అనే వ్యక్తి

తన ప్రొఫైల్ చూసి అతన్ని సంప్రదించిన జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన ఒక వైద్యురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఐటీ శాఖ తన బ్యాంకు ఖాతాలను జప్తు చేసిందని చెప్పి రూ.11 లక్షలు తీసుకున్న నిందితుడు

డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగగా, ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడంతో, పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

ఇదే తరహాలో ముంబై, బెంగళూరు ప్రాంతాల్లో తమను మోసం చేసినట్లు నిందితుడి మీద ఫిర్యాదు చేసిన పలువురు యువతులు

ఈ వ్యవహారంలో నిందితుడితో పాటు, షాదీ డాట్ కామ్ డైరెక్టర్ అనుపమ్ మిట్టల్, టీమ్ లీడర్ విఘ్నేష్, మేనేజర్ సతీష్‌ల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు

తమ మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించగా, సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిందితులు

ఈ పిటిషన్ విచారిస్తూ షాదీ డాట్ కామ్ సైబర్ నేరగాళ్లకు మార్గాన్ని సులువుగా చేసిందని, అందుకే మీ మీద కేసు నమోదు చేశారని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు

ఈ కేసు గురించి తెలంగాణ హైకోర్టు పునఃసమీక్షించుకుని, స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని విచారణ ముగించిన సుప్రీంకోర్టు