తెలంగాణ మహిళలకు గుడ్‌ న్యూస్…ఆ రోజే చీరల పంపిణీ…!

.భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ మహిళలకు గుడ్‌ న్యూస్…
ఆ రోజే చీరల పంపిణీ…!

హైద్రాబాద్:
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా, నవంబర్ 19న ‘ఇందిరా మహిళా శక్తి’ పేరుతో ఉచిత చీరల పంపిణీ ప్రారంభించనుంది.

బతుకమ్మ కానుకగా ఇవ్వాల్సిన చీరలు పండుగ నాటికి సిద్ధం కాకపోవడంతో వాయిదా పడ్డాయి.

నవంబర్ 15 నాటికి తయారీ పూర్తిచేసి 19న చీరలను పంపిణీ చేయనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 1.94 లక్షల మహిళలకు సిరిసిల్ల, వరంగల్, కరీంనగర్‌లో తయారైన రూ.800 విలువ గల నాణ్యమైన చీరలు అందించనున్నారు