.భారత్ న్యూస్ హైదరాబాద్….నేటితో ముగియనున్న సరస్వతీ నది పుష్కరాలు: వైభవంగా ముగింపు కార్యక్రమాలు
సరస్వతీ నది పుష్కరాలు నేటితో ముగియనున్న నేపథ్యంలో విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుండి వీఐపీ ఘాట్ వద్ద వేద స్వస్తి పఠనంతో ప్రారంభమయ్యే ముగింపు ఉత్సవంలో బ్రహ్మశ్రీ నాగ ఫణిశర్మ సందేశం, మంత్రుల ప్రసంగాలు ఉంటాయి. అనంతరం రాత్రి 7:45 గంటలకు నవరత్నమాల హారతితో పుష్కరాలకు అధికారికంగా ముగింపు ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా రాత్రి 7:46 నుంచి 7:54 వరకు డ్రోన్ షో ఏర్పాటు చేయనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది….
