అధికారపార్టీలో దుమారం…

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….అధికారపార్టీలో దుమారం…

మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు

మా ఇంటికి ఎందుకొచ్చారు అంటూ పోలీసులతో గొడవకు దిగిన కొండా సురేఖ కూతురు కొండ సుస్మిత..!

కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ కోసం నిన్నటి నుండి గాలిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు..!

సుమంత్ .. కొండ సురేఖ ఇంట్లో తలదాచుకున్నట్టు సమాచారం ఉండటంతోనే మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లినట్టు తెలుస్తుంది..!

నిన్న సుమంత్ ను బాధ్యతలనుండి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం…!
••••
సురేఖను తప్పించే పనిలో ఉన్నట్లుగా అనుమానాలు..!

మొన్న కొంతమంది రెడ్డి ముఖ్యలు తనపై కుట్రలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేసిన సురేఖ..!

మేడారం టెండర్ల వివాదంలో పైచేయి సాధించిన పొంగులేటి..!

పొంగులేటికి పరోక్షంగా మద్దతుగా నిలిచిన మంత్రి సీతక్క..!

మేడారంలో మంత్రుల కార్యక్రమానికి గైర్హాజరైన సురేఖ..!

కార్యక్రమంలో పాల్గొన్న పొంగులేటి, సీతక్క..!

పని ఒత్తిడి వల్లే వెళ్లలేకపోయానని వివరణ ఇచ్చిన సురేఖ..!

అధిష్టానం పెద్దలకు సీతక్క కూడా సురేఖపై ఫిర్యాదు చేసినట్లు ప్రచారం..!

ముఖ్యమంత్రి సురేఖపై సీరియస్ అయినట్లుగా ముఖ్యుల నుండి మీడియాకి సమాచారం లీక్..!

అదంతా అబద్ధమని చెప్పిన సురేఖ..!

ఈలోగా సుమంత్ వ్యవహారంపై రచ్చ..!

అరెస్ట్ చేస్తే కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం..!

ఏకంగా ఒక మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లి నిందితుడి గురించి వెతకడం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది..!
…..