..భారత్ న్యూస్ హైదరాబాద్….రైలు కింద ప్రేమ జంట రొమాన్స్.. తృటిలో తప్పిన ప్రమాదం
ఇటీవల కొందరు ప్రేమికులు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. తాము జనాల మధ్య ఉన్నామనే విషయం మర్చిపోయి.. మరీ ప్రవర్తిస్తున్నారు. మరికొన్ని ప్రేమ జంటలు అయితే బైకులపై రొమాన్స్ చేస్తూ రెచ్చిపోతుంటాయి. ఇలా శృతిమించి రెచ్చిపోయిన కొందరు ప్రాణాలు సైతం కోల్పోయారు. ఇంకొందరు గాయపడి.. జీవితాన్ని నరకంగా సాగిస్తున్నారు. తాజాగా ఓ ప్రేమ జంట కూడా ఎక్కడా స్థలం లేనట్లు.. రైల్వే ట్రాక్‌పై ఆగిన గూడ్స్ ట్రైన్ కింద రొమాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వీడియో చివర్లోని సన్నివేశం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. ఆ ప్రేమ పక్షులు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.
ఇద్దరూ ప్రేమికులు రైల్వే ట్రాక్ పై ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ కింద కూర్చొన్నారు. చేతులు పట్టుకుని రొమాన్స్ చేసుకోవడం ఆ వీడియో లో కనిపిస్తుంది. పసుపు రంగు చీర ధరించిన మహిళను ఆమె ప్రియుడు కౌగిలించుకోవటం కనిపిస్తుంది. వారు తమ చుట్టూ ఏం జరుగుతుందో అనే విషయాన్ని కూడా మరచి రొమాన్స్ లో మునిగిపోయారు. తమను ఎవరూ చూడటం లేదని భావించి.. వేరే లోకంలో మునిగిపోయారు. ఇక గూడ్స్ రైలు ఆవాసంగా మారడంతో మొదట్లో యువకుడు తన ప్రియురాలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ కనిపిస్తారు. కాసేపటి తర్వాత గూడ్స్ రైలు అకస్మాత్తుగా నెమ్మదిగా కదలడం ప్రారంభిస్తుంది. ట్రైన్ నుంచి పెద్ద శబ్దం రావడంతో గాఢంగా ప్రేమలో ఉన్న ఈ జంట భయపడింది.

అకస్మాత్తుగా గూడ్స్ రైలు స్టార్ట్ అయిందని గ్రహించి.. వెంటనే తేరుకున్నారు. ఒకరినొకరు పట్టుకుని ట్రాక్ నుంచి పక్కకు తప్పుకున్నారు. వారు పక్కకు రాగానే గూడ్స్ ట్రైన్ స్పీడ్ గా అక్కడి నుంచి వెళ్లిపోయింది. తృటిలో ప్రమాదం నుంచి బయటపడటంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. క్షణిక సుఖం కోసం ప్రాణాలు తీసుకుంటారా? అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.