అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు మృతి

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం

మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు మృతి

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. గార్ల మండల మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కూతురు మేఘన, ముల్కనూర్ గ్రామ ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కూతురు భావన ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం.

ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇటీవల అమెరికాకు వెళ్లిన ఈ ఇద్దరు యువతులు రోడ్డు ప్రమాదంలో అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనతో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.