భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….రశీదుల్లేకుండా బియ్యం తరలిస్తున్న లారీ పట్టివేత
జహీరాబాద్ నియోజకవర్గం చిరాగ్ పల్లి పరిధిలోని మాడిగి శివారు ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద ఎలాంటి రశీదులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని పోలీసులు పట్టుకున్నారు.
ఎస్ఐ కె రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, జిజే 37 టి 9543 నంబరు గల లారీలో సుమారు 9 లక్షల 95 వేల 8 వందల 40 రూపాయల విలువైన రేషన్ బియ్యాన్ని గుర్తించారు.

తక్కువ ధరకు కొని, ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ధరకు అమ్ముతూ అక్రమ వ్యాపారం చేస్తున్నారని, ఈ క్రమంలో చెవ్వ భాస్కర్, రమేష్ ఖజారియ అనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు.