కిషన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు

…భారత్ న్యూస్ హైదరాబాద్….కిషన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు

ఇటీవలే కొజ్జాగాల్ల కింద పని చేయలేనని హాట్ కామెంట్స్ చేసిన రాజాసింగ్.. ఇప్పుడు మరోసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు

సీఎం రేవంత్ రెడ్డి సహాయం అడుగుతున్న వారికి చెవులు ఉన్నా వినపడవు.. నోరున్నా చెప్పరు’ అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు

నిన్న శిల్పాకళా వేదికలో జరిగిన గవర్నర్ దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తాను కలిస్తే తెలంగాణ అభివృద్ధి పథంలో వేగంగా దూసుకుపోతుందని.. ఆయన సహకరిస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని చేసిన వ్యాఖ్యలపై హాట్ కామెంట్స్ చేసిన రాజాసింగ్

అలాంటి మహానుభావులను అడిగితే ఏం సహాయం చేస్తారు అంటూ కిషన్ రెడ్డిని పోరోక్షంగా విమర్శించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్….