భారత్ న్యూస్ ఢిల్లీ…..భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో విమర్శలు గుప్పించారు. భారతీయ వస్త్రాలపై 18%సుంకం విధిస్తూ.. అమెరికా పత్తిని వాడితేనే బంగ్లాదేశ్‌కు 0% సుంకం వర్తింపజేయడం వెనుక పెద్దకుట్ర ఉందని ఆరోపించారు. అమెరికా పత్తిని దిగుమతి చేసుకుంటే మన పత్తి రైతులు నాశనమవుతారని, లేకపోతే మన వస్త్ర పరిశ్రమ దెబ్బతింటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం లక్షలాది కుటుంబాల జీవనోపాధిని పణంగా పెట్టి, మోదీ దేశ ప్రయోజనాలను “లొంగిపోయి” తాకట్టు పెట్టారని రాహుల్ విమర్శించారు.
