నేపాల్‌లో జైళ్ల నుంచి 7,000 మంది ఖైదీలు పరార్

భారత్ న్యూస్ హైదరాబాద్….నేపాల్‌లో జైళ్ల నుంచి 7,000 మంది ఖైదీలు పరార్

నేపాల్‌లో రాజకీయ అస్థిరత, జన్‌జెడ్‌ ఆందోళనలతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి.

ఈ గందరగోళంలో 7,000 మంది ఖైదీలు జైళ్ల నుంచి పారిపోయారు.

పోకరాలో 900, నవల్పరాసిలో 500 మంది తప్పించుకోగా, బాంకే జైలు దగ్గర జరిగిన కాల్పుల్లో ఐదుగురు జూవెనైల్ ఖైదీలు, ముగ్గురు పోలీసులు మృతి చెందారు.

భారత సరిహద్దు దగ్గర 10 మంది ఖైదీలు పట్టుబడ్డారు.

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నేపాల్ ఆర్మీ కర్ఫ్యూ విధించి జైళ్లను రక్షించే ప్రయత్నం చేస్తోంది.